Oorellipota Mama Song was sung by Ram Miriyala and the lyrics was written by Anand Gurram and Ram Miriyala
Song by | ChowRaasta |
Lyrics | Anand Gurram and Ram Miriyala |
Singer | Ram Miriyala |
Song | Oorellipota Mama |
Oorellipota Mama Song Lyrics – Telugu
ఊరెలిపోతా మామా.. ఊరెలిపోతా మామా
ఎర్ర బసేక్కీ మళ్ళీ తీరిగెలిపోతా మామ ||2||
ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ
ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ ||2||
నల్లమల అడవుల్లోనా ..పులిసింతా సెట్లకింద
మల్లెలూ పూసేటి ..సల్లనీ పల్లె ఒకటుంది
మనసున్నా పల్లె జనం ..మోసం తెలియని తనం
అడవి ఆ పల్లె అందం..పువ్వు తేనెల సందం
నల్లమల అడవుల్లోనా ..పులిసింతా సెట్ల కిందా
పుత్తడీ గనుల కోసం సిత్తడీ బావులు తవ్వే
పుత్తడీ మెరుపుల్లోనా మల్లెలు మాడిపోయే
మనసున్నా పల్లె జనం వలసల్లో సెదిరిపోయే
ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ
ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ ||2||
గోదారీ లంకల్లోనా ..అరిటాకు నీడల్లోనా
ఇసుక తిన్నేళ్లు మీద ..వెండి వెన్నెల్లు కురువా
గంగమ్మ గుండెల్లోనా ..వెచ్చంగా దాచుకున్నా
సిరిలేన్నో పొంగిపొర్లే ..పచ్చనీ పల్లెఒకటుంది
ఏ… గోదారీ గుండెల్లోనా ..అరిటాకు నీడల్లోనా
ఇసుకంతా తరలిపోయే ..ఎన్నెల్లు రాలిపాయే
ఎగువ గోదారీ పైన ..ఆనకట్టలు వెలిసే
ఆ పైనా పల్లెలన్ని ..నిలువునా మునిగిపోయే
ఏవూరెళ్తావ్ రామ ..ఏముందానేలతావ్ రామ
ఊరన్న పేరే తప్పా ..తీరంతా మారే రామ
సొంతగూటి సమస్యలు,సామాజిక సమస్యల పైన యువతను నిద్రలేపేలా రాసిన సాహిత్యానికి శతకోటి వందనాలు🙏
-ఊరికి దూరంగా ఉన్న అసమర్థుడు
For More Songs from ChowRaasta click here.
Please feel free to comment if you want to suggest anything..!